karthi: రజనీ సినిమాలు చూసి చప్పట్లు కొట్టాలంతే: హీరో కార్తీ

  • హిట్ కోసం కార్తీ వెయిటింగ్ 
  • రజనీ సినిమాలు రీమేక్ చేయాలనుకోకూడదు 
  • 'కాప్పన్' హిట్ అవుతుందన్న కార్తీ
కొంతకాలంగా కార్తీకి సరైన హిట్ పడలేదు. దాంతో ఆయన ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో వున్నాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయనకి ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. 'రజనీకాంత్ చేసిన సూపర్ హిట్ చిత్రాలలో ఏ సినిమా రీమేక్ లో మీకు నటించాలని వుంది?' అనే ప్రశ్నకి కార్తీ తనదైన స్టైల్లో స్పందించాడు.

'రజనీకాంత్ సూపర్ స్టార్ .. ఆయన సినిమాలు చూసి చప్పట్లు కొట్టాలేగానీ, రీమేక్ చేయాలనే సాహసం చేయకూడదు. ఆయన సినిమాలను రీమేక్ చేయాలనుకోవడం పెద్ద రిస్క్ .. అలాంటి రిస్క్ నేను చేయదలచుకోలేదు' అని అన్నాడు. ప్రస్తుతం తన దృష్టి తన అన్నయ్య చేసిన 'కాప్పన్' సినిమాపైనే ఉందనీ, ఈ సినిమా సూర్యకి తప్పకుండా హిట్ తెచ్చిపెడుతుందనే నమ్మకం ఉందంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. 
karthi
surya

More Telugu News