Laloo Prasad Yadav: లాలూ ప్రసాద్ యాదవ్ తో పాటు బీజేపీ ఎంపీకి భద్రతను తొలగించిన కేంద్ర ప్రభుత్వం

  • వీఐపీల భద్రతపై కేంద్రం సమీక్ష
  • లాలూ, రూడీలకు సీఆర్పీఎఫ్ భద్రత తొలగింపు
  • చిరాగ్ పాశ్వాన్ భద్రత వై కేటగిరీకి కుదింపు

సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ కు జడ్ ప్లస్ సెక్యూరిటీని తొలగించబోతున్నారంటూ వార్తలు వచ్చిన గంటల వ్యవధిలోనే కేంద్ర ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, బీజేపీ ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూడీ, ఉత్తరప్రదేశ్ మంత్రి సురేశ్ రాణాలకు కేంద్ర రిజర్వ్ బలగాల (సీఆర్పీఎఫ్) భద్రతను తొలగిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. లోక్ జనశక్తి పార్టీ నేత చిరాగ్ పాశ్వాన్ భద్రతను వై కేటగిరీకి తగ్గిస్తున్నట్టు నోటిఫికేషన్ లో పేర్కొంది.

అఖిలేశ్ యాదవ్ కు 2012 నుంచి అత్యాధునిక ఆయుధాలను ధరించిన 22 మంది ఎన్ఎస్జీ కమెండోలు సెక్యూరిటీగా ఉంటున్నారు. ఇప్పుడు ఈ భద్రతను తగ్గించబోతున్నారు.

More Telugu News