governer: గవర్నర్ నరసింహన్ కు వీడ్కోలు పలకడం బాధగా ఉంది: సీఎం జగన్

  • నా చేయి పట్టుకుని ఆయన నడిపించారు
  • ఈ ఐదేళ్లు ఆయన కొనసాగితే బాగుండేది
  • నరసింహన్ ను ఎప్పుడూ గుర్తుంచుకుంటాం

ఏపీ గవర్నర్ నరసింహన్ కు వీడ్కోలు పలకడం ఒక వైపున బాధగానూ ఉంది, మరోవైపున ఆయన ఎక్కడికీ పోవడం లేదు పక్కనే ఉన్నారన్న ఆనందమూ ఉందని సీఎం జగన్ అన్నారు. విజయవాడలో గవర్నర్ నరసింహన్ కు ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, గవర్నర్ నరసింహన్ పది సంవత్సరాలుగా తనకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి అని, తనకు తండ్రితో సమానమని, సలహాలు ఇస్తూ ఉండేవారని గుర్తుచేసుకున్నారు.

‘ఇప్పుడైతే, ముఖ్యమంత్రి అయిన తర్వాత పూర్తిగా నా చేయి పట్టుకుని నన్ను దగ్గరుండి నడిపించే కార్యక్రమం కూడా చేశారు. ఇంకా, మన గవర్నర్ గా కొనసాగి ఉన్నట్టయితే, నా చేయి పట్టుకుని ఈ ఐదు సంవత్సరాల పాటు నడిపించే ఒక మంచి అవకాశాన్ని మనం కోల్పోయామని చెప్పి మనసులో కొంచెం బాధ అనిపించినా, నిండు మనసుతో ఆయన ఆశీస్సులు మనకెప్పుడూ ఉంటాయని’ జగన్ ఆకాంక్షించారు. నరసింహన్ కు కూడా ఏపీ ప్రజలు, తమ తరపున ఆయన్ని ఎప్పుడూ గుర్తుంచుకుంటామని, పెద్దాయన స్థానంలో ఆయన్ని ఙ్ఞాపకం చేసుకుంటామని అన్నారు. 

More Telugu News