Akash: ‘ఇస్మార్ట్ శంకర్’ కాన్సెప్ట్ నాదే.. ప్రొడ్యూసర్ కౌన్సిల్‌లో ఫిర్యాదు చేశాం!: హీరో ఆకాశ్

  • వ్యక్తి మెదడు మార్పిడి కాన్సెప్ట్‌తో ‘ఇస్మార్ట్ శంకర్’
  • రాధ అనే దర్శకురాలు సినిమా తెరకెక్కించారన్న ఆకాశ్
  • ‘నాన్ యార్’ పేరుతో తమిళ్‌లో విడుదల
చాలా కాలం తర్వాత డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఓ మంచి హిట్ కొట్టారు. రామ్ హీరోగా తెరకెక్కిన ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. కాన్సెప్ట్ కొత్తగా ఉండటంతో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. అయితే ఈ సినిమా వ్యక్తి మెదడును మార్పిడి చేయడమనే కాన్సెప్ట్‌తో రూపొందింది. అయితే ఈ కాన్సెప్ట్ తను తయారు చేసిన కథదని, తననే హీరోగా పెట్టి రాధ అనే దర్శకురాలు తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించారని ‘ఆనందం’ ఫేమ్ ఆకాశ్ తెలిపాడు.

ఈ సినిమా తమిళ్‌లో ఇప్పటికే ‘నాన్ యార్’ పేరుతో విడుదలైందని, తెలుగులో ‘కొత్తగా ఉన్నాడు’ టైటిల్‌తో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఆకాశ్ పేర్కొన్నాడు. అదే సమయంలో విడుదలైన ‘ఇస్మార్ట్ శంకర్’ తమను షాక్‌కు గురి చేసిందని, ఈ విషయమై పూరిని సంప్రదించేందుకు యత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదన్నాడు. తక్షణమే తమిళ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్‌లో ఫిర్యాదు చేసి, మీడియాను ఆశ్రయించామన్నాడు. సమస్య సామరస్యంగా పరిష్కారం కాకుంటే, న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ఆకాశ్ తెలిపాడు.
Akash
Puri Jagannadh
Ram
Ismart Shankar
Radha
Non Yaar

More Telugu News