Andhra Pradesh: ఏ ముఖ్యమంత్రీ ఇలా ఉద్యోగావకాశాలు కల్పించలేదు..ఇవి బాహుబలి నియామకాలు: ఏపీ మంత్రి పెద్దిరెడ్డి

  • గ్రామ సచివాలయాల కోసం భారీగా నియామకాలు
  • 4.01 లక్షల కొత్త ఉద్యోగాలు
  • ఏపీ చరిత్రలోనే కాదు దేశ చరిత్రలోనూ ఇలా జరగలేదు
ఏపీ చరిత్రలోనే కాదు దేశ చరిత్రలో కూడా ఎన్నడూ లేని విధంగా ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నామని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, గ్రామ సచివాలయాల కోసం భారీ స్థాయిలో కొత్త ఉద్యోగ నియామకాలు చేపట్టామని, ఏకంగా 4.01 లక్షల కొత్త ఉద్యోగ నియామకాలు చేపట్టి రికార్డు సృష్టించారని అన్నారు. ఈ స్థాయిలో ఏ ముఖ్యమంత్రీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించలేదని, ఇవి బాహుబలి నియామకాలని ప్రశంసించారు. రాష్ట్ర వ్యాప్తంగా 11,114 గ్రామ సచివాలయాలు, 3786 వార్డు సచివాలయాలను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు.
Andhra Pradesh
cm
jagan
minister
peddireddy

More Telugu News