తుది అంకానికి చేరుకున్న కర్ణాటక రాజకీయం.. సీఎం రాజీనామా చేయనున్నట్టు ప్రచారం

22-07-2019 Mon 17:25
  • విశ్వాస పరీక్షను ఎదుర్కోవడానికి ముందే రాజీనామా
  • సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడుకుంటామన్న డీకే
  • గవర్నర్ అపాయింట్‌మెంట్ తీసుకున్న కుమారస్వామి!
ఇప్పటి వరకూ డైలీ సీరియల్‌లా కొనసాగుతూ వచ్చిన కర్ణాటక రాజకీయం, నేడు తుది అంకానికి చేరుకునేలా కనిపిస్తోంది. విశ్వాస పరీక్షను ఎదుర్కోవడానికి ముందే కుమారస్వామి తన పదవికి రాజీనామా చేయనున్నట్టు ప్రచారం జరుగుతోంది.  

మరోపక్క, సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు జేడీఎస్ రెడీగా ఉందని, ప్రభుత్వం గట్టెక్కుతుందనే నమ్మకం తమకు ఉందని కాంగ్రెస్ నాయకుడు డీకే శివకుమార్ చెబుతుండగా.. కుమారస్వామి నిర్ణయం మాత్రం చర్చనీయాంశంగా మారింది. విశ్వాస పరీక్షలో తనకు ఓటమి ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండటంతోనే కుమారస్వామి ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన గవర్నర్ అపాయింట్‌మెంట్ కూడా తీసుకున్నట్టు తెలుస్తోంది. నేటి సాయంత్రం 7 గంటలకు తన రాజీనామాను సమర్పించనున్నట్టు సమాచారం.