అఖిల్ జోడీగా కొత్త అమ్మాయి ఖరారు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అఖిల్ జోడీగా కొత్త అమ్మాయి ఖరారు

  • 'బొమ్మరిల్లు' భాస్కర్ నుంచి ప్రేమకథా చిత్రం 
  • రెండవ షెడ్యూల్ షూటింగుకి సన్నాహాలు
  • కథానాయిక ఎవరనేది త్వరలోనే వెల్లడి
మంచి కథను సెట్ చేసుకుని అఖిల్ తో ఒక సినిమా చేయడానికి 'బొమ్మరిల్లు' భాస్కర్ రంగంలోకి దిగాడు. యూత్ ను దృష్టిలో పెట్టుకుని తయారు చేసుకున్న విభిన్నమైన ప్రేమకథ ఇది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై ఈ సినిమా నిర్మితమవుతోంది.

ఈ సినిమా కోసం చాలామంది కొత్త కథానాయికల పేర్లను పరిశీలించారు. తాము అనుకున్న స్థాయి హీరోయిన్ కోసం అన్వేషిస్తూనే, అఖిల్ తదితరులపై కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. రెండవ షెడ్యూల్ షూటింగుకి సమయం దగ్గర పడుతుండటంతో, కొత్త అమ్మాయిని కథానాయికగా ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. అయితే మంచి ముహూర్తం చూసుకుని ఆమె పేరును ప్రకటించాలనే ప్లాన్ చేసినట్టుగా సమాచారం. అఖిల్ జోడీగా ఛాన్స్ కొట్టేసిన ఆ అమ్మాయి ఎవరో చూడాలి మరి.
Akhil

More Telugu News