Chandrayaan 2: చంద్రయాన్ 2: నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్ఎల్వీ

  • నిప్పులు చిమ్ముతూ నింగికెగసిన జీఎస్ఎల్వీ
  • ప్రపంచ అంతరిక్ష రంగంలో సత్తా చాటిన ఇస్రో
  • ఆనందంలో మునిగితేలుతున్న యావత్ భారతదేశం

అంతరిక్ష పరిశోధనల రంగంలో భారత్ సత్తాను చాటింది. అగ్రదేశాలకు దీటుగా జాబిల్లిపై ఏముందో శోధించే క్రమంలో మరో అడుగు వేసింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయన్-2 ప్రయోగం జరిగింది. షార్ అంతరిక్ష కేంద్రంలోని రెండో లాంచ్ ప్యాడ్ నుంచి జీఎస్ఎల్వీ మార్చ్3ఎం1 వాహకనౌక నిప్పులు చిమ్ముతూ నింగికెగసింది. మధ్యాహ్నం 2.43 నిమిషాలకు ఇది నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రయోగంతో యావత్ దేశం ఆనందంలో మునిగిపోయింది.

ఈ ప్రయోగం ద్వారా జీఎస్ఎల్వీ ఆర్బిటర్, ల్యాండర్, రోవర్ లను తనతో పాటు తీసుకెళ్లింది. రాకెట్ బరువు 640 టన్నులు. 3,877 కిలోల బరువు కలిగిన చంద్రయాన్- కాంపోజిట్ మాడ్యూల్ తో రాకెట్ పయనిస్తోంది. భూమికి 181 కిలోమీటర్ల ఎత్తులో చంద్రయాన్-2 మాడ్యూల్ విడిపోతుంది.

ఈ ప్రయోగానికి రూ. 978 కోట్లు ఖర్చయింది. ఇస్రో చేపట్టిన ఈ ప్రయోగాన్ని యావత్ ప్రపంచం ఆసక్తికరంగా పరిశీలిస్తోంది.

More Telugu News