KCR: 'బిగ్ బాస్' షో వివాదంపై జగన్, కేసీఆర్ లకు కన్నా ట్వీట్

  • బిగ్ బాస్ పై క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి
  • యువతను పెడదారి పట్టించేలా షో ఉంది
  • షో ప్రసారం కాకుండా అనుమతి రద్దు చేయండి

ఇరు తెలుగు రాష్ట్రాల్లో బిగ్ బాస్ రియాల్టీ షో వివాదాస్పదం అవుతోంది. మహిళలను కించపరిచేలా షో ఉందంటూ పలువురు విమర్శిస్తున్నారు. జర్నలిస్ట్ శ్వేతారెడ్డి, సినీనటి గాయత్రి గుప్తాలు ఈ షోలో క్యాస్టింగ్ కౌచ్ ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనం రేకెత్తించింది.

ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ లను ఉద్దేశిస్తూ ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ట్వీట్ చేశారు. 'బిగ్ బాస్ సిరీస్ పై క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆ షో భారతీయ సంప్రదాయాలు, మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించి యువతను పెడదారి పట్టించేలా ఉంది. తెలుగు రాష్ట్రాలు కచ్చితంగా ఈ షో ప్రసారం కాకుండా అనుమతి రద్దు చేయాలని విన్నవిస్తున్నా' అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ను ఇద్దరు ముఖ్యమంత్రులకు ట్యాగ్ చేశారు.

More Telugu News