Pakistan: అమెరికాలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు తీవ్ర అవమానం!

  • అమెరికాకు వచ్చిన పాక్ ప్రధాని
  • స్వాగతం పలికేందుకు రాని అమెరికా మంత్రులు
  • దౌత్యాధికారి ఇంట్లోనే బస చేసిన ఇమ్రాన్ ఖాన్

పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు అమెరికాలో ఘోర అవమానం ఎదురైంది. మూడు రోజుల పర్యటన నిమిత్తం ఆయన వాషింగ్టన్ కు చేరుకోగా, ప్రొటోకాల్ ప్రకారం ఆయనకు స్వాగతం పలికేందుకు ఒక్క అమెరికా మంత్రి కూడా రాలేదు. సాధారణంగా ఓ దేశ ప్రధాని అమెరికాకు వెళితే, విదేశాంగ మంత్రి, ఆయనకు వీలుకాకుంటే మరో మంత్రి స్వాగతం పలుకుతారు.

అయితే, ఇమ్రాన్ రావడానికి ముందే యూఎస్ చేరుకున్న పాక్ విదేశాంగ మంత్రి షా మహమ్మద్ ఖురేషీ, యూఎస్ లో పాక్ దౌత్యాధికారులు మినహా మరే అమెరికా అధికారీ ఎయిర్ పోర్టుకు రాలేదు. ఇమ్రాన్ సైతం ప్రభుత్వ ఆతిథ్యం స్వీకరించకుండా, తమ రాయబారి అసద్ మజీద్ ఖాన్ అధికారిక నివాసంలో బస చేయాలని నిర్ణయించుకున్నారు. కాగా, తన పర్యటనలో భాగంగా ఇమ్రాన్, యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ తో చర్చలు జరపనున్నారు.

More Telugu News