సీతాఫల్‌మండిలో కూలిన పురాతన భవనం : 14 నెల బాలుడి మృతి

Sun, Jul 21, 2019, 11:59 AM
  • తల్లికి తీవ్రగాయాలు
  • ఈరోజు ఉదయం ఘటన
  • కొన్నాళ్లుగా అదే భవనంలో ఉంటున్న తల్లీకొడుకులు
పురాతన భవనం కూలిన ఘటనలో అందులో నివసిస్తున్న తల్లీ కొడుకుల్లో బాలుడు మృతి చెందగా తల్లి తీవ్రంగా గాయపడింది. సికింద్రాబాద్‌ పరిధిలోని సీతాఫమండిలోని ఈరోజు ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు...స్వాతి దంపతులు, ఆమె కొడుకు గీతామ్స్‌14 నెలలు) ఈ పాత భవనంలో కొన్నాళ్లుగా నివసిస్తున్నారు. ఉదయం వీరు ఉంటున్న భవనం పైకప్పు హఠాత్తుగా కూలిపోయింది.

ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తల్లీకొడుకుల్లో గీతామ్స్‌ అక్కడికక్కడే చనిపోగా స్వాతి తీవ్రంగా గాయపడింది. స్థానికులు హుటాహుటిన స్వాతిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆమె భర్త ఆ సమయంలో ఇంట్లో లేరు. విషయం తెలుసుకున్న నగరపాలక డిప్యూటీ కమిషనర్‌ రవికుమార్‌ ఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad