చిన్నప్పుడే తల్లి దూరమయ్యింది...తండ్రి చనిపోయాక చేరువయ్యింది
- పద్నాలుగేళ్ల తర్వాత మాతృమూర్తి కనిపించడంతో కుమార్తెల ఆనందం
- భావోద్వేగానికి గురయిన తల్లి
- భగవంతుడే ఆసరా కల్పించాడని ఆనందం
తండ్రి మనసెరిగిన కుమార్తెలు కూడా కష్టపడి చదివి ఒకరు ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా, మరొకరు కోల్‌కతాలోని ఓ అతిథి గృహం ఉద్యోగినులుగా స్థిరపడ్డారు. కాగా, భాగ్యరాజ్ రెండు వారాల క్రితం చనిపోయాడు. తండ్రి అంతిమ సంస్కారం కోసం షకీలా వచ్చింది. రెండు రోజుల క్రితం సోదరి కోల్‌కతా బయలు దేరడంతో చెల్లిని డ్రాప్ చేసేందుకు రైల్వేస్టేషన్‌కి వెళ్లింది.
అక్కడ తల్లి కనిపించడంతో ఆశ్చర్యపోవడం అక్కాచెల్లెళ్ల వంతయింది. దగ్గరకు వెళ్లి తల్లిని పలకరించగా ఆమె ఆశ్చర్యంగా చూసింది. తామెవరిమో చెప్పడంతో ఆమె కూడా భావోద్వేగానికి గురయ్యింది. ఆనందంతో పొంగిపోయి బిడ్డల్ని దగ్గరకు తీసుకుంది. చిన్నప్పుడే మిమ్మల్ని వదిలేసి వెళ్లిపోయినందుకు బాధపడుతున్నానంటూ భోరుమంది. కుమార్తెలు ఎంతో ఆనందంగా ఆమెను ఇంటికి తీసుకువెళ్లారు.