FaceApp: ఫేస్ యాప్ కు నకిలీలు వస్తున్నాయి జాగ్రత్త... నెటిజన్లను హెచ్చరించిన కాస్పర్ స్కీ

  • విశేష ప్రాచుర్యం పొందిన ఫేస్ యాప్
  • నకిలీ యాప్ తో యాడ్ వేర్లు, మాల్వేర్లు మొబైల్లో  ప్రవేశిస్తాయంటున్న సైబర్ నిపుణులు
  • మొబిడ్యాష్ పేరుతో యాడ్ వేర్ తీవ్ర నష్టం కలుగజేస్తోందన్న భద్రతా సంస్థ

ఇప్పుడు ఎక్కడ చూసినా ఫేస్ యాప్ గురించే చర్చ. ఈ యాప్ సాయంతో వృద్ధాప్యంలో తమ ముఖం ఎలా ఉంటుందో చూసుకునే సౌకర్యం ఉండడంతో యువత వేలంవెర్రిగా డౌన్ లోడ్ చేస్తోంది. ప్రముఖులు సైతం ఫేస్ యాప్ తో వివిధ దశల్లో తమ ముఖారవిందం ఎలా ఉందో చూసుకుని మురిసిపోతున్నారు. అయితే, ఫేస్ యాప్ ను పోలిన నకిలీ యాప్ లు వస్తున్నాయని, వాటితో జాగ్రత్తగా ఉండాలని ప్రముఖ సైబర్ భద్రతా సంస్థ కాస్పర్ స్కీ హెచ్చరిస్తోంది. నకిలీ యాప్ లు డౌన్ లోడ్ చేసుకుంటే వాటితోపాటే యాడ్ వేర్లు, మాల్వేర్లు కూడా మొబైల్ ఫోన్లో చొరబడతాయని కాస్పర్ స్కీ నిపుణులు చెబుతున్నారు. మొబిడ్యాష్ పేరుతో ఇప్పటికే ఓ యాడ్ వేర్ స్మార్ట్ ఫోన్లలో స్వైరవిహారం చేస్తోందని అన్నారు. దీని ప్రభావంతో ఫోన్ సొంతదారుకు, కాంటాక్ట్ లిస్టులో ఉన్న వ్యక్తులకు నష్టం తప్పదని అంటున్నారు.

More Telugu News