వీఆర్వోలు ఎవరి భూమినైనా ఎవరికైనా రాసిస్తున్నారు: కేసీఆర్

షార్ట్స్‌లో చూడండి
వీఆర్వోలు సక్రమంగా పని చేయడం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో కొత్త మున్సిపల్ చట్టానికి సంబంధించిన బిల్లుపై మాట్లాడుతూ, వీఆర్వోల అరాచకాలు పెరిగిపోయాయని అన్నారు. వీఆర్వోలు ఎవరి భూమినైనా ఎవరికైనా రాసిస్తున్నారని... ఇకపై ఇలాంటి వాటిని ఉపేక్షించే ప్రసక్తే లేదని చెప్పారు. రాష్ట్రంలోని ఏ ఉద్యోగినైనా ఎక్కడికైనా బదిలీ చేసేలా చట్టాన్ని తీసుకురాబోతున్నామని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలు పన్నులను సక్రమంగా చెల్లించాలని... ప్రతి నెలా నీటి బిల్లును క్లియర్ చేయాలని చెప్పారు. లేకపోతే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Go Back to Shorts
KCR
TRS
VRO

More Telugu News