క్లాస్ లీడర్ పోటీలో అమ్మాయి ఓడించిందని బాలుడి ఆత్మహత్య!
- యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘటన
- ఎనిమిదో తరగతి చదువుతున్న సాయి చరణ్
- పోటీలో ఓడిపోయి మనస్తాపంతో ఆత్మహత్య
ఈ ఎన్నికల్లో సాయి చరణ్ నిలబడగా, విద్యార్థులంతా పోటీలో నిలిచిన మరో అమ్మాయిని గెలిపించారు. తోటి అమ్మాయి చేతిలో ఓడిపోయానన్న మనస్తాపంతో నిన్న సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిపోయాడు సాయి చరణ్. అతని కోసం వెతుకుతుంటే, పట్టణ శివార్లలోని రైలు పట్టాలపై అతని మృతదేహం కనిపించింది. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొనగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు ప్రారంభించారు.