Mohammad Azharuddin: హెచ్‌సీఏ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నా: అజారుద్దీన్

  • 2017 ఎన్నికల్లో అజర్ నామినేషన్‌ను తిరస్కరించిన హెచ్‌సీఏ
  • ఈసారి మాత్రం తప్పకుండా పోటీ చేసి తీరుతానని స్పష్టీకరణ
  • మూడు ప్రపంచకప్‌లలో భారత్‌కు ప్రాతినిధ్యం

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్ష పదవికి తాను పోటీపడతానని కాంగ్రెస్ నేత, టీమిండియా మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్ ప్రకటించారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా పోటీ పడతానని స్పష్టం చేశారు. ఈ నెల 21న జరగనున్న హెచ్‌సీఏ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో ఎన్నికలకు సంబంధించి ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

హెచ్‌సీఏ అధ్యక్ష పదవి కోసం 2017లో అజారుద్దీన్ నామినేషన్ వేయగా హెచ్‌సీఏ తిరస్కరించింది. తనపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసినట్టు బీసీసీఐ ఇచ్చిన పత్రాలను సమర్పించలేదన్న కారణంతో అప్పట్లో అజర్ నామినేషన్‌ను తిరస్కరించారు. అంతేకాదు, అతడికి క్లబ్‌లో ఓటు హక్కు ఉందో? లేదో అన్న విషయంలో కూడా స్పష్టత లేదని హెచ్‌సీఏ పేర్కొంది. దీంతో ఆ ఎన్నికల నుంచి అజర్ తప్పుకోవాల్సి వచ్చింది. ఈసారి మాత్రం తప్పకుండా పోటీచేసి తీరుతానని అజర్ ప్రకటించాడు. 1992, 1996, 1999 ప్రపంచకప్‌లలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన అజర్ 2000వ సంవత్సరంలో మ్యాచ్ ఫిక్సింగ్‌లో దొరికిపోయి నిషేధానికి గురయ్యాడు.

More Telugu News