TRS: కాంగ్రెస్ నాయకత్వం చేస్తున్న తప్పులను సహించలేకే అలా చెప్పా: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

  • మీడియా నా మాటలను వక్రీకరించింది
  • టీఆర్ఎస్ ప్రశ్నించే గొంతుక లేకుండా చేసింది
  • కాంగ్రెస్‌కు కొత్త నాయకత్వం వస్తే బాగుంటుంది

కాంగ్రెస్ నాయకత్వం చేస్తున్న తప్పులను సహించలేకే టీఆర్ఎస్‌కు బీజేపీయే ప్రత్యామ్నాయం అని చెప్పా తప్పా ఆ పార్టీలోకి వెళ్లేందుకు కాదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి స్పష్టం చేశారు. నేడు ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, తాను పార్టీలో కొనసాగాలని ఆకాంక్షించిన ఓ కార్యకర్తకు అనుకూలంగా మాట్లాడితే దానిని మీడియా వక్రీకరించిందని ఆరోపించారు.

టీఆర్ఎస్ ప్రశ్నించే గొంతుక లేకుండా చేసిందని, కాంగ్రెస్‌కు కొత్త నాయకత్వం వస్తే బాగుంటుందని సూచించానని రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. బీజేపీకి ఉన్నది ఒక్కరే ఎమ్మెల్యే అని, తనను రమ్మంటే తాను వెళ్లట్లేదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఉద్యమం చేస్తానన్నారు. రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ కుంతియా అందరినీ కలుపుకుని వెళ్లడంలో విఫలమయ్యారని రాజగోపాల్‌రెడ్డి ఆరోపించారు.    

More Telugu News