Karnataka: అసమ్మతి ఎమ్మెల్యేల భవితవ్యం తేలే వరకూ విశ్వాసపరీక్ష నిర్వహించొద్దు: సిద్ధరామయ్య

  • అసెంబ్లీకి వెళ్లని రెబల్ ఎమ్మెల్యేలు
  • సభకు హాజరు కాకపోవడమంటే విప్ ధిక్కరించినట్లే
  • మా ప్రభుత్వాన్ని బీజేపీ పడగొట్టాలని చూస్తోంది

కర్ణాటకలోని సంకీర్ణ ప్రభుత్వం బలపరీక్ష ఎదుర్కొనేందుకు సిద్ధపడ్డ విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కర్ణాటక అసెంబ్లీకి కాంగ్రెస్- జేడీఎస్, బీజేపీ సభ్యులు హాజరయ్యారు. రెబల్ ఎమ్మెల్యేలు మాత్రం హాజరు కాలేదు. ఈ విషయమై సిద్ధరామయ్య మాట్లాడుతూ, సభకు హాజరు కాకపోవడమంటే విప్ ధిక్కరించినట్లే అని అన్నారు. పార్టీ నాయకుడిగా విప్ జారీ చేేసే హక్కు తనకు ఉందని, అసమ్మతి ఎమ్మెల్యేల భవితవ్యం తేలే వరకూ విశ్వాసపరీక్ష జరపడం సరికాదని అభిప్రాయపడ్డారు. తమ ప్రభుత్వాన్ని బీజేపీ పడగొట్టాలని చూస్తోందని అన్నారు.

More Telugu News