ఈ నెల 21 లేదా 22 తేదీల్లో చంద్రయాన్-2 ప్రయోగానికి యోచన!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఈ నెల 21 లేదా 22 తేదీల్లో చంద్రయాన్-2 ప్రయోగానికి యోచన!

  • జూలై 15న జరగాల్సిన ప్రయోగం
  • క్రయోజనిక్ దశలో లీకేజ్ కారణంగా వాయిదా
  • లోపాన్ని గుర్తించి సరిచేస్తున్న ఇస్రో సాంకేతిక నిపుణులు
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న చంద్రయాన్-2 ప్రయోగం సాంకేతిక లోపంతో అర్థంతరంగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఈ నెల 15 వేకువ జామున శ్రీహరికోటలోని షార్ కేంద్రంలో జరగాల్సిన ప్రయోగం వాయిదా పడింది. ఒక చిన్న లీకేజ్ ప్రతిష్ఠాత్మక ప్రాజక్టును నీరుగార్చింది. అయితే, లోపాన్ని వెంటనే గుర్తించిన ఇస్రో వర్గాలు ఈసారి మరింత లోప రహితంగా ప్రయోగం నిర్వహించాలని తలపోస్తున్నారు.

చంద్రయాన్-2 స్పేస్ క్రాఫ్ట్ క్రయోజనిక్ దశలో లీకేజి ఉన్నట్టు తెలుసుకున్నారు. దీన్ని సరిచేసేందుకు ఇస్రో ఇంజినీర్ల బృందం అహర్నిశలు కృషి చేస్తోంది.

అన్నీ అనుకూలిస్తే ఈ నెల 21న గానీ, 22వ తేదీన గానీ చంద్రయాన్-2 ప్రయోగం నిర్వహించాలని ఇస్రో వర్గాలు భావిస్తున్నాయి. మొదట లాంచ్ కు అనువైన సమయంగా జూలై 22వ తేదీగా నిర్ణయించినా, అంతకుముందు రోజు కూడా ప్రయోగానికి అనుకూలంగానే ఉండడంతో ఈ రెండు తేదీల్లో ఏదో ఒక రోజు ప్రయోగం నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ISRO
Chandrayaan-2

More Telugu News