కాపులకు సరే.. బ్రాహ్మణులకు కూడా కేటాయిస్తే బాగుంటుంది!: ఐవైఆర్ కృష్ణారావు
- కాపులకు బడ్జెట్ లో రూ.2,000 కోట్లు
- రాబోయే ఐదేళ్లలో రూ.10 వేల కోట్లు ఇస్తామన్న సీఎం జగన్
- బ్రాహ్మణులకు కూడా రూ.వెయ్యి కోట్లు ఇవ్వాలన్న ఐవైఆర్
కాపు సామాజిక వర్గానికి ఇచ్చిన హామీ మేరకు బడ్జెట్ లో రూ.2 వేల కోట్లు కేటాయించడాన్ని స్వాగతిస్తున్నట్లు ఐవైఆర్ తెలిపారు. అదేవిధంగా బ్రాహ్మణులకు కూడా రాబోయే ఐదేళ్లకు రూ.1000 కోట్లు కేటాయించాలని కోరారు. ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఐవైఆర్ ట్విట్ చేశారు.