Facebook: బిట్ కాయిన్ తరహా కరెన్సీ ఆలోచన విరమించుకున్న ఫేస్ బుక్!

  • లిబ్రా పేరుతో క్రిప్టో కరెన్సీ తీసుకురావాలని భావించిన ఫేస్ బుక్
  • అన్ని వైపుల నుంచి ఆందోళనలు
  • ప్రభుత్వ అనుమతి వస్తేనే లిబ్రాపై నిర్ణయమన్న ఫేస్ బుక్

ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్ బుక్ లిబ్రా పేరుతో వర్చువల్ కరెన్సీని తీసుకురావాలన్న ఆలోచనను ప్రస్తుతానికి పక్కనపెట్టింది. బిట్ కాయిన్ తరహాలో క్రిప్టో కరెన్సీ ప్రారంభిస్తున్నట్టు కొంతకాలం కిందట ఫేస్ బుక్ ప్రకటించగానే భిన్నాభిప్రాయాలు వచ్చాయి. ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థలకు సమాంతరంగా ఆర్థిక వ్యవస్థను ఏర్పాటు చేస్తే, మున్ముందు దాన్ని అదుపు చేయడం కష్టమంటూ ఆందోళనలు వ్యక్తమయ్యాయి.

ఇప్పటికే బిట్ కాయిన్ విషయంలో అనేక సందేహాలు కలుగుతున్న నేపథ్యంలో ఫేస్ బుక్ లిబ్రాపై అమెరికా ట్రెజరీ శాఖ కూడా అసహనం వ్యక్తం చేసింది. ఇలాంటి వర్చువల్ కరెన్సీల కారణంగా అక్రమ లావాదేవీలు పెరిగిపోతాయని అభిప్రాయం వెలిబుచ్చింది. ఇలా, అన్నివైపుల నుంచి ప్రతికూల భావనలు వస్తుండడంతో ఫేస్ బుక్ తన నిర్ణయంపై వెనుకంజ వేసింది. ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో అనుమతులు వస్తేనే లిబ్రాపై ఓ నిర్ణయం తీసుకుంటామని ఫేస్ బుక్ యాజమాన్యం తెలిపింది. ఈ మేరకు ఓ ప్రకటన చేసింది.

More Telugu News