అమ్మతోడు.. లంచాలు తీసుకోం: మహబూబ్‌నగర్ కలెక్టర్ సహా ఉద్యోగుల సామూహిక ప్రతిజ్ఞ
- లంచాల నిర్మూలనకు కలెక్టర్ వినూత్న ప్రయోగం
- తల్లి/పిల్లలపై ప్రమాణం చేయించిన కలెక్టర్
- ప్రమాణం అనంతరం పత్రాలపై సంతకాలు
భూత్పూరులో కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అధికారులు దైవ సాక్షిగా అని ప్రమాణం ప్రారంభించగా కలెక్టర్ జోక్యం చేసుకుని పిల్లలు, తల్లిదండ్రులపై ప్రమాణం చేయాలని సూచించారు. దేవుడిపై ప్రమాణం చేస్తే చేసిన తప్పును కడిగేసుకునే ప్రయత్నం చేస్తారని, కాబట్టి పిల్లలపై ప్రమాణం చేయాలని చెబుతూ స్వయంగా ఆయన తన పిల్లలపై ప్రమాణం చేశారు. ప్రత్యేక అధికారి క్రాంతి తన తల్లిదండ్రులపై ప్రమాణం చేయగా, మిగతా ఉద్యోగులు వారిని అనుసరించారు.