పెద్ద దర్శకులు అవకాశాలు ఇవ్వడం లేదు .. కొత్తవాళ్లు గౌరవించడం లేదు: హాస్యనటి గీతా సింగ్
- అవకాశాలు తగ్గుతున్నాయి
- అడిగినా వేషాలు ఇవ్వడం లేదు
- సీనియర్స్ ను పట్టించుకోవడం లేదు
తెలిసిన దర్శక నిర్మాతలను అడిగితే, తప్పకుండా పిలుస్తామంటారుగానీ పిలవరు. ఇక కొత్తగా చాలామంది దర్శకులు వస్తున్నారు. వాళ్లలో కొంతమంది మాలాంటి ఆర్టిస్టులకు కనీస మర్యాద ఇవ్వడం లేదు. ఇటీవల ఒక కొత్త దర్శకుడి సినిమా కోసం వెళితే నాకు కూడా ఆడిషన్ చేస్తామన్నారు. అప్పటికే అక్కడ ఒక సీనియర్ నటి చాలా సేపటి నుంచి కూర్చుని వున్నారు. ఆమెను పట్టించుకున్నవాళ్లు లేరు. నాకే చాలా బాధగా అనిపించి ఆమెను తీసుకుని అక్కడి నుంచి వచ్చేశాను" అని చెప్పుకొచ్చారు.