మహిళను దారుణంగా హింసించి సామూహిక అత్యాచారం.. రాజస్థాన్ పోలీసుల అకృత్యం
- లాకప్ డెత్‌ను కళ్లారా చూసిన మహిళ
- బయటపెడుతుందన్న ఉద్దేశంతో చిత్ర హింసలు
- ఆపై సామూహిక అత్యాచారం
నేమిచంద్ తన కళ్లముందే చనిపోవడంతో ఆమె ఈ విషయాన్ని ఎక్కడ బయటపెడుతుందోనని పోలీసులు భయపడ్డారు. దీంతో ఆమెను తీవ్రంగా హింసించారు. ఆమె గోళ్లు పీకేశారు. కను రెప్పలు కూడా తెరవలేనంత తీవ్రంగా కొట్టారు. నిస్సహాయురాలిగా పడివున్న ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె ఫిర్యాదు మేరకు ఆరుగురు పోలీసులపై ఆదివారం కేసులు నమోదయ్యాయి. స్థానికంగా సంచలనమైన ఈ ఘటనపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.