Vijay Sai Reddy: మీరో విఫల నాయకుడు : చంద్రబాబుపై విజయసాయిరెడ్డి ధ్వజం

షార్ట్స్‌లో చూడండి
ట్విట్టర్‌ వేదికగా తెలుగుదేశం పార్టీపై విరుచుకుపడే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై మరోసారి ధ్వజమెత్తారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ప్రజలకు ఉపయోగపడింది కాదని ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో సుదీర్ఘకాలం కొనసాగడం ప్రత్యేక అర్హత ఏమీ కాదని, ఈ నలభై ఏళ్లలో చంద్రబాబు ప్రజలకు ఏం చేశారో చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. 'రాష్ట్రాన్ని రాబందుల్లా పీక్కుతిన్నారు. మీ కుటుంబ సభ్యుల ఆస్తులు లక్షల కోట్లకు పెంచుకున్నారు. భావి తరాలకు మీ చరిత్ర అలాగే గుర్తుండిపోతుంది’ అంటూ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
Go Back to Shorts
Vijay Sai Reddy
Chandrababu
Twitter

More Telugu News