కేసీఆర్ పై యుద్ధం చేయడం కుంతియా, ఉత్తమ్ కుమార్ రెడ్డి వల్ల కాదు!: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

  • కాంగ్రెస్ నాకు రాజకీయ జన్మనిచ్చింది
  • పార్టీ షోకాజ్ నోటీసులకు జవాబు ఇచ్చా
  • చండూరులో మీడియాతో కాంగ్రెస్ నేత
కాంగ్రెస్ పార్టీ తనకు రాజకీయ జన్మ ఇచ్చిందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. ఇటీవల తాను చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ అధిష్ఠానం నోటీసులు జారీచేసిందనీ, దానికి తాను జవాబు ఇచ్చానని చెప్పారు. ఇప్పటివరకూ తనపై చర్యలు తీసుకోకపోవడానికి కారణం తాను ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు. తెలంగాణలోని నల్గొండ జిల్లా చండూరులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై యుద్ధం చేయాలంటే అది కాంగ్రెస్ నేతలు కుంతియా, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వల్ల కాదని వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని తాను ఎన్నికల ముందే చెప్పాననీ, ఆ తర్వాత కూడా చెప్పానని గుర్తుచేశారు. ఈ విషయంలో పార్టీకి నష్టం కలిగించరాదన్న ఉద్దేశంతో తాను మౌనంగా ఉండిపోయానని చెప్పారు.
Go Back to Shorts
Telangana
Congress
komatireddy
rajagopal
BJP
TRS
KCR

More Telugu News