Telangana: తెలంగాణలో రైల్వే ప్రాజెక్టులకు కేటాయింపులే లేవని కేటీఆర్ అన్నారు.. అదంతా అవాస్తవం!: ధర్మపురి అరవింద్

  • గతంలో ట్విట్టర్ లో విమర్శించిన కేటీఆర్
  • కేటీఆర్ విమర్శలను తిప్పికొట్టిన సంజయ్
  • ట్విట్టర్ లో బడ్జెట్ కేటాయింపుల జాబితా విడుదల
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం ఎలాంటి నిధులు కేటాయించలేదనీ, కొత్త ప్రాజెక్టులు మంజూరు చేయలేదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వ్యవహారంపై నిజామాబాద్ లోక్ సభ సభ్యుడు, బీజేపీ నేత ధర్మపురి అరవింద్ స్పందించారు. ‘తెలంగాణకు బడ్జెట్ లో కేటాయింపులే జరపలేదని టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చెబుతున్నారు.

కేంద్ర రైల్వే శాఖ తెలంగాణలోని రైల్వే ప్రాజెక్టులకు కేటాయించిన నిధులు ఇవిగో’ అంటూ ఓ జాబితాను ధర్మపురి అరవింద్ విడుదల చేశారు. ఈ ట్వీట్ కు రైల్వే మంత్రి పీయూష్ గోయల్, బీజేపీ, తెలంగాణ బీజేపీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ తదితరులను ట్యాగ్ చేశారు.
Telangana
TRS
KTR
BJP
dharmapuri aravind
Nizamabad District

More Telugu News