Andhra Pradesh: ‘ఈ ఉద్యోగానికి నాకంటే అతనే సమర్థుడు’.. గ్రామ వాలంటీర్ ఇంటర్వ్యూలో గిరిజనుడి వ్యాఖ్య!

  • విశాఖపట్నం జిల్లాలో ఘటన
  • గ్రామ వాలంటీర్ ఇంటర్వ్యూకు ఇద్దరు మాజీ సర్పంచ్ లు హాజరు
  • ఈ ఘటనలతో అవాక్కయిన అధికారులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామాలలో సేవల కోసం గ్రామ వాలంటీర్లను నియమించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే గ్రామ వాలంటీర్ల ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. అయితే మన్యం ప్రాంతాల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్న అధికారులకు మాత్రం వింత అనుభవాలు ఎదురవుతున్నాయి. విశాఖపట్నం జిల్లాలోని జి.మాడుగుల మండలం కిల్లంకోడ మాజీ సర్పంచ్ లక్ష్మి, దేవరపల్లి మాజీ సర్పంచ్ వరలక్ష్మి తమ గ్రామాల్లో గ్రామ వాలంటీర్ పోస్టుల కోసం హాజరయ్యారు.

దీంతో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్న అధికారులు అవాక్కయ్యారు. మరోవైపు గోనగొయ్యి గ్రామంలో గ్రామవాలంటీర్ పోస్టుకు ఇద్దరు దరఖాస్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఇంటర్వ్యూకు హాజరైన ఓ గిరిజనుడు ‘నా కంటే అతను ఈ ఉద్యోగానికి అర్హుడు, సమర్థుడు’ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో గిరిజనుల నిజాయతీకి అధికారులు ఆశ్చర్యపోయారు.
Andhra Pradesh
Visakhapatnam District
grama volunteer
inter view
interview

More Telugu News