బీజేపీలో ఉన్నవారంతా పిరికిపందలే: సిద్ధరామయ్య
- బలపరీక్ష నెగ్గుతామనే నమ్మకం ఉంది
- మాకు భయపడి బీజేపీ ఎమ్మెల్యేలను రిసార్టులకు తరలిస్తున్నారు
- సంక్షోభం వల్ల కూటమి మరింత బలపడింది
నమ్మకం ఉంది కాబట్టే బలపరీక్షకు సిద్ధమయ్యామని సిద్ధరామయ్య తెలిపారు. బీజేపీలో ఉన్నవారంతా పిరికిపందలేనని, అందుకే తమకు భయపడి వారి ఎమ్మెల్యేలను రిసార్టులకు తరలించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా, తమ సంకీర్ణ ప్రభుత్వం కొనసాగుతుందని చెప్పారు. ప్రస్తుత సంక్షోభం వల్ల కూటమి మరింత బలపడిందని అన్నారు.