fimale fish: కావాలనుకున్నప్పుడు మగ చేపలుగా మారిపోతున్న ఆడ చేపలు.. చిక్కుముడి విప్పిన శాస్త్రవేత్తలు

  • తమతో సహజీవనం చేసిన మగ చేపలు చనిపోయినప్పుడు శరీరంలో మార్పులు
  • 20 రోజుల్లోనే పూర్తిస్థాయి మగచేపలుగా మార్పు
  • పరిస్థితులకు అనుగుణంగా జీవన శైలిలో మార్పుల వల్లే ఇది సాధ్యమన్న శాస్త్రవేత్తలు

ఏళ్ల తరబడి చిక్కుముడిగా మారిన ఓ రహస్యాన్ని శాస్త్రవేత్తలు ఎట్టకేలకు ఛేదించారు. క్లోన్‌ఫిష్‌ సహా 500 రకాలకు పైగా చేపలు కావాలనుకున్నప్పుడు మగ చేపలుగా మారిపోతుంటాయి. ఇదెలా సాధ్యమన్న ప్రశ్నకు శాస్త్రవేత్తలు ఇప్పటి వరకు సరైన సమాధానం కనుగొనలేకపోయారు. తాజాగా న్యూజిలాండ్‌లోని ఒటాగో శాస్త్రవేత్తలు ఈ ప్రశ్నకు సమాధానం కనుగొన్నారు. ఈ రహస్యాన్ని తెలుసుకునేందుకు అత్యాధునిక జన్యు విశ్లేషణ విధానాలను ఉపయోగించారు.  

సాధాణంగా క్లోన్‌ఫిష్ సహా నీలం రంగు తల ఉండే చేపలు నడి వయసు వచ్చేసరికి 20 రోజుల్లోనే పూర్తిస్థాయి మగ చేపలుగా మారిపోతున్నాయి. తమతో కలిసి సహజీవనం చేసిన మగ చేపలు చనిపోయినప్పుడు ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఆడ చేపలు మగ చేపలుగా మారిపోతాయని పరిశోధనలో తేలింది. మగ చేపగా మారాలనుకున్న క్షణం నుంచే దాని శరీరంలో మార్పులు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత పది రోజుల్లోనే పూర్తిస్థాయి మగ చేపలుగా మారిపోతాయి. ఆ తర్వాత వాటి శరీరంలో ఈస్ట్రోజన్ హార్మోన్ ‘అరోమాటసీ’ ఉత్పత్తి నిలిచిపోతుంది. ఫలితంగా గర్భధారణ ప్రక్రియ నిలిచిపోతుంది. అదే సమయంలో కొత్తగా వృషణాలు ఏర్పడతాయని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన  ఎరికా టాడ్‌ తెలిపారు.

వృషణాలు ఏర్పడిన తర్వాత పది నుంచి 21 రోజుల్లోనే మగచేపల్లా మారే ఆడచేపలు ఆ తర్వాత మరో పది రోజులకు ప్రత్యుత్పత్తికి సిద్ధమైపోతాయని ఎరికా వివరించారు. పరిస్థితులకు అనుగుణంగా జీవన శైలిని మార్చుకోవడంలో భాగంగానే ఈ మార్పు జరుగుతుందని ఎరికా పేర్కొన్నారు.

More Telugu News