సెమీఫైనల్ పరాజయంపై స్పందించిన రోహిత్ శర్మ
- అరగంట చెత్త ఆటే ఓటమికి కారణం
- అందరిలానే నా హృదయం కూడా బరువెక్కింది
- అండగా ఉన్న అభిమానులకు థ్యాంక్స్
న్యూజిలాండ్‌తో మాంచెస్టర్‌లో జరిగిన సెమీఫైనల్ లో భారత జట్టు 18 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. కివీస్ నిర్దేశించిన 240 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 221 పరుగులకే కుప్పకూలింది. రవీంద్ర జడేజా, ధోనీ మినహా టాపార్డర్ ఘోరంగా విఫలమైంది. లీగ్ దశలో విజయ విహారం చేసిన భారత జట్టు సెమీస్‌లో కుప్పకూలడంతో భారత అభిమానుల ప్రపంచకప్ ఆశలు అడియాసలయ్యాయి.