mehul choksi: మెహుల్ చోక్సీ ఆస్తులపై ఈడీ కొరడా.. రూ.24.77 కోట్ల ఆస్తులు జప్తు

  • పీఎన్‌బీ నుంచి రూ.13 వేల కోట్ల రుణం
  • ప్రస్తుతం అంటిగ్వాలో ఉంటున్న చోక్సీ
  • భారత్ సహా దుబాయ్‌లో ఉన్న ఆస్తుల జప్తు

పంజాబ్ నేషనల్ బ్యాంకుకు వేల కోట్ల రూపాయల రుణాలు ఎగవేసి విదేశాలకు పారిపోయిన కేసులోని నిందితుల్లో ఒకడైన మెహుల్ చోక్సీకి చెందిన రూ.24.77 కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. భారత్ సహా ఇతర దేశాల్లో ఉన్న చోక్సీ ఆస్తులను జప్తు చేసినట్టు ఈడీ అధికారులు తెలిపారు. ఇందులో దుబాయ్ కేంద్రంగా ఉన్న మూడు వాణిజ్య ఆస్తులు, ఒక మెర్సిడెస్ బెంజ్ కారు ఉన్నట్టు పేర్కొన్నారు.

తాజా జప్తుతో కలిసి ఇప్పటి వరకు జప్తు చేసిన  ఆస్తుల మొత్తం రూ.2534.7 కోట్లని వివరించారు. గతేడాది పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి రూ.13 వేల కోట్ల రుణాలు తీసుకున్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ దేశం విడిచి పరారయ్యారు. చోక్సీ ప్రస్తుతం అంటిగ్వాలో తలదాచుకున్నాడు. అతడిని భారత్‌కు రప్పించేందుకు భారత్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.

More Telugu News