కేరళలో జైలు బిర్యానీ... స్విగ్గీలో ఆర్డర్ చేస్తే మీ ఇంటికి!
- కేరళ వియ్యూర్ జైల్లో బిర్యానీ తయారీ
- స్విగ్గీతో ఒప్పందం కుదుర్చుకున్న జైలు అధికారులు
- కాంబో ప్యాక్ లో డెలివరీ
ఇది కాంబో ప్యాక్ లో లభ్యమవుతుంది. ప్లేటు ధర రూ.127గా నిర్ణయించారు. క్యాంబో ప్యాక్ స్పెషాలిటీ ఏంటంటే, ఇందులో 300 గ్రాముల బిర్యానీ రైస్, ఓ చికెన్ లెగ్ పీస్, 3 చపాతీలు, ఓ కప్ కేక్, సలాడ్, రైతా, ఒక వాటర్ బాటిల్ అందిస్తారు. ప్రారంభ దశ కాబట్టి జైలుకు 6 కిలోమీటర్ల పరిధిలో మాత్రమే విక్రయించనున్నారు. ఇక్కడి ఖైదీలు తయారుచేస్తున్న ఈ రుచికరమైన బిర్యానీని ఫ్రీడం ఫుడ్ ఫ్యాక్టరీ తరఫున మార్కెటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కారాగారంలో పాతికవేల చపాతీలు, 500 ప్లేట్ల బిర్యానీ తయారు చేస్తున్నారు.