సాయంత్రం 6 గంటల్లోగా స్పీకర్ ను కలవండి: కర్ణాటక రెబెల్ ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు ఆదేశం
- నేరుగా స్పీకర్ కు రాజీనామాలు ఇవ్వాలంటూ సుప్రీం ఆదేశాలు
- వెంటనే నిర్ణయం తీసుకోవాలంటూ స్పీకర్ కు ఆదేశం
- రెబెల్స్ కు భద్రత కల్పించాలని డీజీపీకి ఆదేశాలు
సుప్రీంకోర్టులో రెబెల్ ఎమ్మెల్యేల తరపున మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి వాదిస్తూ, స్పీకర్ గా నిర్వహించాల్సిన బాధ్యతలను రమేశ్ కుమార్ నిర్వహించడం లేదని అన్నారు. స్పీకర్ ముందుకు ఎమ్మెల్యేలు వెళ్లేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు.