Dhyuti Chand: చిరుతను గుర్తుకు తెస్తూ 100 మీటర్ల పరుగు11.32 సెకన్లలో పూర్తి... ధ్యుతీ చంద్ కు స్వర్ణం!

  • నాప్లెస్ లో వరల్డ్ యూనివర్శిటీ గేమ్స్
  • ఇండియా తరఫున పాల్గొని స్వర్ణం
  • అభినందనలు తెలిపిన కోవింద్, కిరణ్ రిజిజు

నాప్లెస్ లో జరుగుతున్న వరల్డ్ యూనివర్శిటీ గేమ్స్ లో భారత స్ప్రింటర్ ద్యుతీ చంద్ 100 మీటర్ల పరుగులో చిరుతను గుర్తుకు తెస్తూ, 11.32 సెకన్లలో రేస్ ను పూర్తి చేసి స్వర్ణ పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఆమె భారత ఖ్యాతిని ఇనుమడింపజేసిందంటూ ఇప్పుడామెపై ప్రశంసల వర్షం కురుస్తోంది. రాష్ట్రపతి రామ్‌ నాథ్ కోవింద్, కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజిజు ఆమెను ప్రశంసిస్తూ ట్వీట్లు చేశారు. కాగా, కొంతకాలం క్రితం తాను మరో అమ్మాయితో ప్రేమలో ఉన్నానని, స్వలింగ సంపర్కురాలినని, తమ బంధానికి కుటుంబ సభ్యులు అడ్డుపడుతున్నారని ద్యుతీ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

More Telugu News