Mohammad Shami: అపరిచితురాలికి క్రికెటర్ షమీ మెసేజ్ లు... స్క్రీన్ షాట్స్ తీసి ప్రశ్నించిన యువతి!

  • నాకు పదేపదే మెసేజ్ లు చేస్తున్నాడు
  • ఇన్ స్టాగ్రామ్ లో విషయం చెప్పిన సోఫియా
  • షమీ వైఖరిపై విమర్శలు
తనకు అసలు భారత క్రికెటర్ మహమ్మద్ షమీ ఎవరో తెలియదని, అయినా, అతను ఇన్ స్టాగ్రామ్ ద్వారా తనకు పదేపదే మెసేజ్ లు పెడుతున్నాడని, ఓ యువతి ఆరోపించింది. షమీ మెసేజ్ లకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ తీసి తన ఇన్ స్టాగ్రామ్ లో ఆమె పోస్ట్ చేయడంతో అవి వైరల్ అయి, షమీ వైఖరిపై విమర్శలు తెస్తున్నాయి.

గతంలో షమీ స్త్రీలోలుడని, ఎంతో మందితో సంబంధాలు పెట్టుకుని తనను వేధిస్తున్నాడని ఆయన భార్య హసీన్‌ జహాన్‌ ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై కేసు నమోదైనా, బీసీసీఐ మాత్రం క్లీన్ చిట్ ఇచ్చింది. వ్యక్తిగత జీవితంపై విమర్శలు వచ్చినా, తన అద్భుత ఆటతీరుతో షమీ ఎప్పటికప్పుడు మైదానంలో సత్తాను చాటుతూనే ఉన్నాడు.

ఇక తనకు ఏ మాత్రం పరిచయం లేని షమీ మెసేజ్ లు పంపుతున్నాడని ఆరోపించిన సోఫియా అనే మహిళ, 14 లక్షల మంది ఫాలోయర్స్ ఉన్న క్రికెటర్ తనకు మాత్రమే ఎందుకు మెసేజ్ లు చేస్తున్నాడో ఎవరైనా చెప్పగలరా? అని ప్రశ్నించింది. సదరు మహిళకు "గుడ్‌ ఆఫ్టర్‌నూన్‌" అని షమీ మెసేజ్‌ చేసినట్లు స్క్రీన్‌ షాట్స్‌ లో కనిపిస్తోంది. ఇక సోఫియా పోస్ట్ చూసిన వారు పలు రకాలుగా స్పందిస్తున్నారు.
Mohammad Shami
Sofia
Screen Shots
Instagram
Messages

More Telugu News