Vijay Devarakonda: 'డియర్ కామ్రేడ్' నుంచి ట్రైలర్ వచ్చేస్తోంది

  • భరత్ కమ్మ నుంచి 'డియర్ కామ్రేడ్'
  • విజయ్ దేవరకొండ జోడీగా రెండోసారి రష్మిక
  • నాలుగు భాషల్లో ఈ నెల 26న రిలీజ్   

భరత్ కమ్మ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా 'డియర్ కామ్రేడ్' సినిమా రూపొందింది. రష్మిక మందన .. శృతి రామచంద్రన్ కథానాయికలుగా ఈ సినిమా నిర్మితమైంది. జూలై 26వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు.

తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ భాషల్లోను ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఈ నెల 11న ఒక ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. ఆ రోజు ఉదయం 11 గంటల 11 నిమిషాలకి ట్రైలర్ ను వదలనున్నారు. తెలుగుతో పాటు మిగతా మూడు భాషల్లోను ఇదే ముహూర్తానికి ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నారు. ఈ ట్రైలర్ తో సినిమాపై ఏ స్థాయిలో అంచనాలు పెరిగిపోతాయన్నది చూడాలి. 

More Telugu News