ముంబైని ముంచెత్తనున్న అతి భారీ వర్షాలు.. రెడ్ అలెర్ట్ జారీ
- వర్షాల కారణంగా ఇప్పటి వరకు 40 మందికిపైగా మృతి
- నేటి నుంచి శుక్రవారం వరకు అతి భారీ వర్షాలు
- 50 కిలోమీటర్ల వేగంతో తీరాన్ని తాకుతున్న అలలు
రయ్‌గడ్, థానే, పల్ఘర్, రత్నగిరి, సింధుదుర్గ్ జిల్లాలో నేటి నుంచి శుక్రవారం వరకు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది. కెరటాలు 40-50 కిలోమీటర్ల వేగంతో తీరాన్ని తాకుతున్నట్టు పేర్కొంది. శుక్రవారం వరకు సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని వివరించింది.