Sachin Tendulkar: సచిన్ ట్వీట్ పై న్యూజిలాండ్ కోచ్ వ్యాఖ్యలు

  • ధోనీకి సచిన్ బర్త్ డే విషెస్
  • రాబోయే రెండు మ్యాచ్ లు అంటూ సచిన్ ట్వీట్
  • అభ్యంతరం వ్యక్తం చేసిన కివీస్ కోచ్ గ్యారీ స్టీడ్
ధోనీ బర్త్ డే సందర్భంగా క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ చేసిన ట్వీట్ పై న్యూజిలాండ్ క్రికెట్ జట్టు కోచ్ గ్యారీ స్టీడ్ విభిన్నంగా స్పందించాడు. ధోనీకి హ్యాపీ బర్త్ డే అంటూ విషెస్ చెప్పిన సచిన్, వరల్డ్ కప్ లో రాబోయే రెండు మ్యాచ్ లకు అంతా మంచి జరగాలని శుభాకాంక్షలు తెలిపాడు. దీనిపై న్యూజిలాండ్ కోచ్ స్టీడ్ స్పందిస్తూ, మిగతా రెండు మ్యాచ్ లు అని సచిన్ పేర్కొనడంపై అభ్యంతరం వ్యక్తం చేశాడు.

టీమిండియా ఆటగాళ్లు సెమీస్ లో న్యూజిలాండ్ పై గెలిచి, ఫైనల్లో ఆడతారన్న ఉద్దేశంతో సచిన్ ట్వీట్ చేయగా, "ధోనీ ఆ రెండు మ్యాచ్ లు ఆడొచ్చు, ఇది కచ్చితంగా జరుగుతుందని చెప్పలేం. కానీ త్వరలోనే మా ఆటగాళ్ల బర్త్ డేలు కూడా వస్తున్నాయి. వాళ్లకు కూడా సచిన్ నుంచి ఇదే రీతిలో శుభాకాంక్షలు అందుతాయని కోరుకుంటున్నా" అంటూ స్టీడ్ పేర్కొన్నాడు. సెమీస్ లో భారత్ తమను కచ్చితంగా ఓడిస్తుందనేలా సచిన్ వ్యాఖ్యలు ఉండడం స్టీడ్ ను అసహనానికి గురిచేసినట్టు ఈ కామెంట్ల ద్వారా అర్థమవుతోంది.
Sachin Tendulkar
New Zealand
Gary Stead
World Cup

More Telugu News