Jagan: మాట తప్పని, మడమ తిప్పని నేత జగన్: బొత్స

  • మాట తప్పని ప్రభుత్వం మాది
  • మరిన్ని సౌకర్యాలు అందజేస్తాం
  • వైఎస్సార్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం
గత ప్రభుత్వాల్లాగా మాట తప్పని ప్రభుత్వం తమదని, చెప్పింది చేస్తామని, మాట తప్పని, మడమ తిప్పని నేత వైఎస్ జగన్ అని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. నేడు ఆయన మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుతో కలిసి విశాఖలోని లబ్దిదారులకు పెన్షన్ అందజేశారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ, విశాఖ వాసులకు మరిన్ని సౌకర్యాలు అందజేస్తామన్నారు. విశాఖ సెంట్రల్ పార్క్‌ను వైఎస్సార్ సెంట్రల్ పార్క్‌గా మార్చినట్టు తెలిపారు. అక్కడే వైఎస్సార్ విగ్రహాన్ని సెప్టెంబర్ 2న ఏర్పాటు చేస్తామన్నారు. అర్హులందరికీ పథకాలు అందుతాయని బొత్స తెలిపారు.
Jagan
Botsa Satyanarayana Satyanarayana
Muthamsetti Srinivasa Rao
Central Park
YSR Statue

More Telugu News