టీడీపీ ఎమ్మెల్యేకు చేదు అనుభవం.. ప్రభుత్వ కార్యక్రమానికి హాజరుకాకుండా అడ్డుకున్న వైసీపీ శ్రేణులు!
- ఏపీలోని ప్రకాశం జిల్లాలో ఘటన
- ‘రైతు భరోసా’ కార్యక్రమం కోసం వచ్చిన కొండపి ఎమ్మెల్యే వీరాంజనేయ స్వామి
- వెనక్కి వెళ్లిపోవాలంటూ వైసీపీ కార్యకర్తల నినాదాలు
ఈ విషయమై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి హాజరు అవుతున్నట్లు తాను పోలీసులకు ముందుగానే సమాచారం ఇచ్చానని తెలిపారు. అయినా తనకు పోలీసులు రక్షణ కల్పించలేదని అన్నారు. ఓ ఎమ్మెల్యేకే రక్షణ లేకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వ కార్యక్రమానికి హాజరవుతున్న తనను అడ్డుకోవడం దారుణమని వ్యాఖ్యానించారు.