Amarnath Yatra: అమర్ నాథ్ యాత్రపై మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు

  • యాత్రికుల రక్షణ కోసం చేసిన ఏర్పాట్లు ఇబ్బందికరంగా ఉన్నాయి
  • ఆర్మీ, బీఎస్ఎఫ్ బలగాలను కూడా రంగంలోకి దించారు
  • కశ్మీర్ ప్రజలకు వ్యతిరేకంగా ఇవి ఉన్నాయి

45 రోజుల పాటు కొనసాగే అమర్ నాథ్ యాత్ర గత వారం ప్రారంభమైంది. అత్యంత పవిత్రంగా భావించే హిమలింగాన్ని దర్శించుకునేందుకు కనీసం లక్షమంది భక్తులు ఇప్పటికే తమ ప్రయాణాన్ని ప్రారంభించారు. ఈ యాత్రకు సంబంధించి జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు చేశారు. యాత్రకు సంబంధించి చేపట్టిన ఏర్పాట్లను తప్పుబట్టిన ఆమె... ఈ యాత్ర వల్ల స్థానికుల రోజువారీ జీవితానికి ఇబ్బందులు కలుగుతున్నాయని అన్నారు.

యాత్రికుల రక్షణ కోసం చేసిన ఏర్పాట్లు ఇబ్బందికరంగా ఉన్నాయని ముఫ్తీ విమర్శించారు. సీఆర్ఫీఎఫ్, జమ్ముకశ్మీర్ పోలీసులు భక్తుల రక్షణను చూసుకుంటుంటారని... కానీ, ఈసారి మాత్రం ఇండియన్ ఆర్మీ, బీఎస్ఎఫ్ బలగాలను కూడా రంగంలోకి దించారని విమర్శించారు. అమర్ నాథ్ యాత్ర ఎన్నో ఏళ్లుగా కొనసాగుతోందని.... కానీ, ఈసారి చేసిన ఏర్పాట్లు మాత్రం కశ్మీర్ ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నాయని మండిపడ్డారు. అయితే, ఏ ఏర్పాట్లు స్థానికులకు ఇబ్బందికరంగా ఉన్నాయనే విషయాన్ని మాత్రం ఆమె వెల్లడించలేదు. మరోవైపు, ఈ అంశంపై జమ్ముకశ్మీర్ గవర్నర్ కలగజేసుకోవాలని ఆమె కోరారు.

More Telugu News