ప్రతి ట్వీట్ నా హృదయాన్ని తాకుతోంది: నటి సమంత

Sun, Jul 07, 2019, 07:07 PM
  • ‘ఓ బేబీ’ ‘థ్యాంక్స్ మీట్’
  • విడుదలకు ముందు రోజు రాత్రి నాకు నిద్రపట్టలేదు
  • ప్రతి ట్వీట్ ను చదువుతా.. అందరికీ రిప్లై ఇవ్వలేను
నందినీ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ‘ఓ బేబీ’ హిట్ టాక్ సంపాదించుకోవడంతో చిత్రయూనిట్ సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా ఈ చిత్రం ‘థ్యాంక్స్ మీట్’ ను ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నందినీరెడ్డి, నటి సమంత, చిత్ర యూనిట్ తో పాటు హీరో రానా హాజరయ్యారు. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ, ఈ సినిమా విడుదలకు ముందు రోజు రాత్రి మొత్తం తనకు నిద్రపట్టలేదని తెలిపింది. ఈ చిత్రం విడుదలైన తొలిరోజు నుంచే పాజిటివ్ స్పందనలు వచ్చాయని చెప్పింది. ఈ చిత్రం షూటింగ్ లో పాల్గొన్న రోజుల కన్నా ప్రమోషన్ లో పాల్గొన్న రోజులే ఎక్కువని నవ్వులు చిందించింది.

‘ఓ బేబీ’లో తన పాత్రతో ఎంతో సంతృప్తి చెందిన తాను ఈ సినిమా తర్వాత ఇంకేం చేయాలని, ఇక రిటైర్మెంట్ తీసుకోవాలా? అని నందినీరెడ్డితో తాను ప్రస్తావించిన విషయాన్ని సమంత గుర్తుచేసుకుంది. ఈ సినిమా తర్వాత ఏ చిత్రంలో నటించాలి? ఏ చిత్రంలో నటించకూడదు?అనే తికమకలో ఉన్నానని, అయితే, ఈ స్థితి మరో రెండు రోజులు మాత్రమే ఉంటుందని తనకు తెలుసని అన్నారు. సామాజిక మాధ్యమాల్లో తన ఫాలోవర్స్ చేసే ప్రతి ట్వీట్ ను చదువుతాను కానీ, అందరికీ రిప్లై ఇవ్వలేనని చెప్పిన సమంత, ప్రతి ట్వీట్ తన హృదయాన్ని తాకుతోందని చెప్పారు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad