కర్ణాటక సంక్షోభానికి కారణం రాహుల్ గాంధీ నిర్ణయాలే: బీజేపీ నేత మురళీధర్ రావు
- కర్ణాటక రాజకీయాలను నిశితంగా పరిశీలిస్తున్నాం
- ఇక్కడి సంక్షోభానికి మేము కారణం కాదు
- కొత్త ప్రభుత్వం ఏర్పడి ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తుంది
ఎమ్మెల్యేల రాజీనామాలతో కర్ణాటక ప్రభుత్వం మైనార్టీలో పడిందని, స్పీకర్ దీనిపై త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నట్టు చెప్పారు. గవర్నర్, కోర్టులు అన్ని విషయాలు గమనిస్తున్నాయని అన్నారు. అవకాశవాదంతో కాంగ్రెస్- జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయని విమర్శించారు. వీలైనంత త్వరగా కర్ణాటక సంక్షోభానికి తెరపడాలని, కొత్త ప్రభుత్వం ఏర్పడి ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తుందని మురళీధర్ రావు ఆకాంక్షించారు.