Telangana: సీఎం కేసీఆర్ పై బీజేపీ నేత ధర్మపురి అరవింద్ తీవ్ర వ్యాఖ్యలు!

  • తెలంగాణపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టింది
  • కుటుంబపాలనకు స్వస్తి పలకాలి
  • కేంద్ర పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయట్లేదు

తెలంగాణ రాష్ట్రంపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టిందని, ఈ విషయమై నిన్న అమిత్ షా పర్యటనలో స్పష్టమైన సంకేతాలిచ్చారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. కామారెడ్డిలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా అరవింద్ మాట్లాడుతూ, కేంద్ర ప్రథకాలను తెలంగాణలో అమలు చేయడం లేదని విమర్శించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పై ఆయన విరుచుకుపడ్డారు. కుటుంబపాలనకు స్వస్తి పలకాలని అన్నారు. కేంద్ర పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని విమర్శించారు.

ఆవాస్ యోజన కోసం కేంద్ర ప్రభుత్వం తెలంగాణాకు ఇచ్చిన నిధులను కమిషన్ వచ్చే ప్రాజెక్టుల కోసం ఈ ప్రభుత్వం మళ్లిస్తోందని ఆరోపించారు. ప్రపంచంలోనే అతిపెద్ద పథకం ‘ఆయుష్మాన్ భవ’ను అమలు చేయడం లేదని విమర్శించారు. పసుపు రైతుల ఇబ్బందుల తీర్చే రోజు దగ్గరకు వచ్చిందని, ఆ సమస్యను పరిష్కరించిన రోజున టీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్ తమ నెత్తిపై గుడ్డ వేసుకుని కూర్చోవాల్సి వస్తుందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.     

More Telugu News