East Godavari District: కేంద్రంతో గొడవ పెట్టుకుంటే ఏమొస్తుంది : రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్‌

  • సఖ్యంగా ఉంటూనే హక్కులు సాధిస్తాం
  • కేంద్ర బడ్జెట్‌లో కేటాయింపులు లేని మాట వాస్తవమే
  • ప్రత్యేక హోదా అంశం ఎప్పటికీ బతికే ఉంటుంది
కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక కేటాయింపులు లేకపోవడం నిరాశ కలిగించిందని, అయితే రెండు మూడురోజుల్లో దీనిపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నట్లు రాజమండ్రి వైసీపీ ఎంపీ మార్గాని భరత్‌ అన్నారు. ఈరోజు ఉదయం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటూనే హక్కులు సాధిస్తామని స్పష్టం చేశారు. కేంద్రంతో గొడవ పెట్టుకోవడం వల్ల ఒరిగేదేమీ లేదన్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా అంశం ఇంకా సజీవంగానే ఉందని,  ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి పోరాట పటిమ వల్ల అది ఎప్పటికీ సజీవంగానే ఉంటుందన్నారు. క్లీన్‌ గంగా తరహాలో క్లీన్‌ గోదావరి చేపట్టేలా కేంద్రానికి ప్రతిపాదనలు అందించామని తెలిపారు. అలాగే రాజమండ్రికి స్మార్ట్‌ సిటీ, వారసత్వ నగరం హోదా కోసం ప్రయత్నిస్తానని తెలిపారు.
East Godavari District
rajahmundry MP
margani bharat
BJP

More Telugu News