BJP: మోదీ కంటే కేసీఆర్‌ కరడుగట్టిన హిందుత్వ వాది : ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ

  • మోదీ మూడు గుడులే తిరుగుతారు
  • కేసీఆర్‌ ఆరు గుడులు తిరిగే వ్యక్తి
  • తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కలే
భారతీయ జనతా పార్టీపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ మరోసారి మండిపడ్డారు. హిందుత్వ కార్డుతో ఆ పార్టీ తెలంగాణలో ఎదగాలన్న కలలు ఫలించవని, 2024లో తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్న ఆ పార్టీ నేతల కల కలగానే మిగులుతుందని ఎద్దేవా చేశారు. స్థానికంగా జరిగిన ఓ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ కంటే సీఎం కేసీఆర్‌ కరడుగట్టిన హిందుత్వ వాది అన్నారు. మోదీ మూడు గుడులు తిరిగే రకమైతే, కేసీఆర్‌ ఆరు గుడులు తిరిగే రకమన్నారు. అందువల్ల బీజేపీ ఆటలు తెలంగాణలో సాగవని స్పష్టం చేశారు. ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచే సత్తాలేని బీజేపీ హిందుత్వ నినాదాన్ని ఎత్తుకోవడంపై ఆయన విమర్శలు కురిపించారు. ఆ పార్టీ తెలంగాణలో బలపడేందుకు మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందని ధ్వజమెత్తారు.
BJP
MIM
Asaduddin Owaisi

More Telugu News