కర్ణాటక సంక్షోభం: గోవాకు ఎగిరిపోతున్న కాంగ్రెస్, జేడీఎస్ అసంతృప్త ఎమ్మెల్యేలు
- కర్ణాటకలో ముదురుతున్న రాజకీయ సంక్షోభం
- ప్రత్యేక విమానంలో గోవాకు ఎమ్మెలు
- స్పీకర్‌కు రాజీనామా లేఖ అందించిన 13 మంది కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్యేలు
కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాతో అధిష్టానం అప్రమత్తమైంది. పరిస్థితిని సమీక్షించి చక్కదిద్దేందుకు ఆ పార్టీ కర్ణాటక ఇన్‌చార్జ్ కేసీ వేణుగోపాల్‌ను బెంగళూరుకు పంపింది.
అధికార కాంగ్రెస్-జేడీఎస్ కూటమికి చెందిన 13 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసినట్టు జేడీఎస్ ఎమ్మెల్యే విశ్వనాథ్ ప్రకటించి కలకలం రేపారు. గవర్నర్ వజుభాయ్ వాలాతో సమావేశం అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 13 మంది ఎమ్మెల్యేలు తమ రాజీనామా పత్రాలను స్పీకర్‌కు అందించి ఆమోదించాల్సిందిగా కోరినట్టు తెలిపారు.