Sunil Diodhar: ఎన్టీఆర్ బాహుబలిలా ఉంటే.. కట్టప్పలా చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు: బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు

  • చంద్రబాబు చందాల బాబులా మారారు
  • అభివృద్ధి నిధుల్లో సైతం అవినీతికి పాల్పడ్డారు
  • టీడీపీ నాయకత్వం లేని పార్టీ
  • ఆ ఇంటిని వదిలి చంద్రబాబు వెళ్లేది జైలుకే
ఏపీలో ఎన్టీఆర్ బాహుబలిలా ఉంటే చంద్రబాబు కట్టప్పలా వెనుక ఉండి వెన్నుపోటు పొడిచారంటూ బీజేపీ ముఖ్య నేత సునీల్ దేవధర్ ఆరోపించారు. గుంటూరు జిల్లా వెంగళాయ పాలెంలో నేడు బీజేపీ చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు చందాల బాబులా మారారని, అభివృద్ధి కోసం కేటాయించిన నిధుల్లో సైతం అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు.

గత ఐదేళ్లలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్నారు. దళితుల అభివృద్ధిని సహించలేక రావెల కిశోర్ బాబుని మంత్రి పదవి నుంచి తొలగించారన్నారు. టీడీపీ నాయకత్వం లేని పార్టీ అని, పెద్ద ఎత్తున ఆ పార్టీ నేతలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. చంద్రబాబు అవినీతి రుజువైతే రెండేళ్లలో జైలు కెళ్తారని, కరకట్టపై ఉన్న ఇంటిని చంద్రబాబుతో ఖాళీ చేయిస్తే ఆ ఇంటిని వదిలి ఆయన వెళ్లేది జైలుకేనని సునీల్ వ్యాఖ్యానించారు.
Sunil Diodhar
Chandrababu
BJP
Ravela Kishore Babu
NTR
Bahubali
Kattappa

More Telugu News