USA: అమెరికాలో భారీ భూకంపం... తొలి చిత్రాలు బీభత్సం!

  • గడచిన 25 ఏళ్లలో అత్యధిక తీవ్రత
  • లాస్ ఏంజిల్స్ కు 202 కిలోమీటర్ల దూరంలో కేంద్రం
  • ఇంకా అందని ప్రాణనష్టం వివరాలు

అమెరికాలో గడచిన 25 సంవత్సరాల్లో ఎన్నడూ రానంత భారీ భూకంపం సంభవించింది. దక్షిణ కాలిఫోర్నియాలో భూమి కంపించగా, రిక్టర్‌ స్కేల్ పై దీని తీవ్రత 7.1గా నమోదైంది. భూకంపాన్ని చూసిన ప్రజలు తీవ్ర భయాందోళనలతో వీధుల్లోకి పరిగెత్తుకుంటూ వచ్చారు. మాల్స్ లోని సరుకులన్నీ కిందపడ్డాయి. రోడ్లు బీటలు వారాయి. భూకంపానికి సంబంధించిన తొలి చిత్రాలు విడుదలయ్యాయి. లాస్‌ ఏంజెల్స్‌కు 202 కిలోమీటర్ల దూరంలో భూకంపకేంద్రం ఉందని అధికారులు వెల్లడించారు. ఈ భూకంపం తరువాత జరిగిన ఆస్తి, ప్రాణ నష్టంపై వివరాలు అందాల్సివుంది. కాగా, గురువారం నాడు 6.4 తీవ్రతతో ఇదే ప్రాంతంలో భూకంపం రాగా, ప్రాణనష్టం జరగలేదు.

More Telugu News